
10వ తరగతి అర్హతతో గ్రామీణ పోస్టు ఆఫీసులలో 48వేల ఉద్యోగాలు
జీతం నెలకు – 29380/-
పూర్తి వివరాలు :
పోస్టల్ డిపార్ట్మెంట్ లో కేవలం పదో తరగతి అర్హతతో ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. దాదాపుగా 48 వేల ఉద్యోగాలు ఈసారి భర్తీ చేయబోతున్నారు. ప్రతి సంవత్సరం పోస్టల్ GDS ఉద్యోగాలు భర్తీకి రెండుసార్లు నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఈ సంవత్సరం కొత్త నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం వచ్చింది. వివిధ కారణాల వలన 01-07-2024 నుండి 31-12-2024 వరకు ఏర్పడిన ఖాళీలు మరియు, 2024 జూలై లో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాకుండా మిగిలిన ఉద్యోగాలను కలిపి ఈసారి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని తాజాగా విడుదల చేసిన ఒక నోటీసులో తెలిపారు. ఈ సంవత్సరం కొత్త నోటిఫికేషన్ జనవరి 29వ తేదీన విడుదల కాబోతున్నట్లుగా ఈ నోటీసు ద్వారా తెలుస్తుంది.
అర్హత: 10th పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు
భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు GDS అనే ఉద్యోగాలను భర్తీ చేస్తారు
వయస్సు: 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు PwD అభ్యర్థులకు వయస్సులో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సడలింపు కూడా వర్తిస్తుంది. అనగా SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది
పరీక్ష విధానం: ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష నిర్వహించరు. కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
ఎంపిక విధానం: ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు
జీతం:
BPM ఉద్యోగాలకు ఎంపికైన వారికి 12,000/- నుండి 29,380/- వరకు జీతము ఉంటుంది.
ABPM / Dak Sevak ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10,000/- నుండి 24,470/-
ఫీజు:
SC, ST, PWD మరియు మహిళ అభ్యర్థులకు ఫీజు లేదు.
మిగతా అభ్యర్థులు 100/- ఫీజు చెల్లించాలి..
మరికొన్ని ముఖ్యమైన వివరాలు :
జనవరి 29వ తేదీన విడుదల చేయబోయే నోటిఫికేషన్ లో మొత్తం భర్తీ చేయబోయే పోస్టులు, రాష్ట్రాలవారీగా ఉన్న పోస్టల్ సర్కిల్స్ వారీగా ఉన్న ఖాళీలు వివరాలు ప్రకటిస్తారు.